: ఫ్లిప్ కార్ట్ సంస్థ ‘బిగ్ 10’ మొదటి రోజు ఆఫర్లలో కొన్ని!


ఈ-కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్ కార్ట్’ స్థాపించి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారీ తగ్గింపుపై ఆయా ఉత్పత్తులను అందిస్తోంది. ఈ రోజు నుంచి 18వ తేదీ వరకు ‘బిగ్ 10’ సేల్ పేరిట ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైళ్లు, ఇతర వస్తువులపై భారీ తగ్గింపు ప్రకటించింది. ఈ రోజు తగ్గింపు ధరలు ప్రకటించిన వాటిలో టీవీలు, అప్లియెన్సెస్, ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ , హోమ్ అండ్ ఫర్నిచర్ కు సంబంధించిన వస్తువులు ఉన్నాయి.

యాపిల్ వాచ్ సిరీస్ 2, సిరీస్ 1పై రూ.5,000 రకూ తగ్గింపు ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు వినియోగదారులు రూ.1500 అదనంగా, ఫోన్ పే విధానంలో చెల్లింపులు చేసే వాళ్లు రూ.300 క్యాష్ బ్యాక్ పొందవచ్చు. శాంసంగ్ గేర్ ఫిట్ 2 అసలు ధర రూ.15,000 ఉండగా.. రూ.6,990కే అందిస్తోంది. పానసోనిక్ షినోబి 49 అంగుళాల ఫుల్ హెచ్ డీ స్మార్ట్ ఎల్ ఈడీ టీవీ రూ.78,900 ఉండగా, ప్రత్యేక ఆఫర్ కింద రూ.49,999కే అందిస్తోంది.

  • Loading...

More Telugu News