: విజయవాడలో దారుణం.. భార్యను హతమార్చి ఇంటి ఆవరణలో పూడ్చిపెట్టిన భర్త!


విజయవాడ లోని సింగ్ నగర్ వాంబే కాలనీలో దారుణం జరిగింది. తన భార్యను అతి కిరాతకంగా హత్య చేసిన భర్త, ఇంటి ఆవరణలోనే ఆమెను పూడ్చి పెట్టాడు. మరియమ్మ, ప్రసాద్ భార్యాభర్తలు. కొంతకాలంగా, వీరి మధ్య తలెత్తిన మనస్పర్థల కారణంగా గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో మరియమ్మను హత్య చేసి, తన ఇంటి ఆవరణలో పూడ్చిపెట్టాడు. అయితే, తమ కూతురు కనపడకపోవడంతో మరియమ్మ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు ప్రసాద్ ని అదుపులోకి తీసుకుని విచారణ జరపగా అసలు విషయం బయటపడింది. మరియమ్మ మృతదేహాన్ని పోలీసులు వెలికి తీస్తున్నారు.

  • Loading...

More Telugu News