: నిషిత్ కారు యాక్సిడెంట్ అయిన చోటే మరో ప్రమాదం!


ఓవర్ స్పీడుతో వచ్చిన బెంజ్ కారు ప్రమాదానికి గురై ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ మరణించిన ఘటనను మరువక ముందే, అదే ప్రాంతంలో మరో ప్రమాదం జరిగింది. తన కారులో రాంగ్‌ రూట్‌ లో వచ్చిన ఓ యువతి మరో కారును ఢీ కొట్టింది. హైదరాబాదు, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14కు చెందిన రాము అనే వ్యక్తి, తన కారులో మాదాపూర్‌ కు బయలు దేరి, జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబరు 36కు రాగా, ఆ సమయంలో రాంగ్‌ రూట్‌ లో వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో రెండు కార్లూ ధ్వంసం కాగా, డ్రైవింగ్‌ సీట్లో ఉన్న యువతి కారును అక్కడే వదిలి పారిపోయింది. రాము ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు కారు ఎవరిదన్న విషయాన్ని గుర్తించే పనిలో పడ్డారు.

  • Loading...

More Telugu News