: హైదరాబాద్ లో బీభత్సం సృష్టించిన స్కార్పియో.. ఒకరి మృతి!
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఓ స్కార్పియో వాహనం ఈ రోజు రాత్రి బీభత్సం సృష్టించింది. వేగంగా వస్తూ ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపై అటూ ఇటూ దూసుకెళ్లింది. రెండు కార్లు, నాలుగు బైకులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమే కారణమని స్థానికులు అంటున్నారు. ఒక్కసారిగా స్కార్పియో దూసుకురావడంతో తాము భయాందోళనలకు గురయ్యామని మీడియాకు తెలిపారు. ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.