: ఆ హత్య చేసింది ఇండియన్ ఏజెన్సీలే: హిజ్బుల్ అధినేత సయ్యద్ సలాహుద్దీన్


ఆర్మీ అధికారి ఉమర్ ఫయాజ్ ను కిడ్నాప్ చేసి, హత్య చేసిన ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ అధినేత సయ్యద్ సలాహుద్దీన్ తెలిపాడు. బంధువుల వివాహం కోసం కశ్మీర్ కు చెందిన ఈ యువ సైనికాధికారి వచ్చినప్పుడు ఆయనను కిడ్నాప్ చేసి, ఆ తర్వాత అత్యంత కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడ్డ ముగ్గురు హిజ్బుల్ ఉగ్రవాదుల ఫొటోలను జమ్ముకశ్మీర్ పోలీసులు పోస్టర్ల రూపంలో విడుదల చేశారు. వీరికి సంబంధించిన ఆచూకీ తెలిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

ఈ ఘటనపై సలాహుద్దీన్ మాట్లాడుతూ, తమకు కాని, తమ మిలిటెంట్లకు కాని దీంతో సంబంధం లేదని చెప్పాడు. ఈ హత్యను తాము కూడా ఖండిస్తున్నామని తెలిపాడు. భారత ఏజెన్సీలే ఉమర్ ఫయాజ్ ను హత్య చేశాయని ఆరోపించాడు. జీహాద్ ను విశ్వసించే కుటుంబం నుంచి ఫయాజ్ వచ్చాడని... అందుకే భారత ఏజెన్సీలు అతడిని హతమార్చాయని చెప్పాడు. ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకే... నిందను మిలిటెంట్లపై మోపుతున్నారని అన్నాడు.

  • Loading...

More Telugu News