: ‘ఆర్మీ’కి డొనేషన్ ఇస్తున్నామనే మాట అవాస్తవం!: ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ


‘బాహుబలి-2’ మొదటి రోజు కలెక్షన్లను ఆర్మీకి డొనేషన్ కింద ప్రకటించామనే వార్తలు అవాస్తవమని ఈ చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ స్పష్టం చేశారు. ఈ విషయమై వస్తున్న పుకార్లను ఆయన ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వెయ్యి కోట్లు అంటే తెలియని నిర్మాతను తానని, ఈ విజయం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. అయితే, తమ చిత్రం విజయం సాధించడం చూసి అసూయ పడుతున్న కొందరు కావాలని చెప్పే, తాము ఆర్మీకి డబ్బు డొనేట్ చేస్తున్నామనే వదంతులు సృష్టిస్తున్నారన్నారు. ఆర్మీకి ‘బాహుబలి’ టీమ్ ఎలాంటి డొనేషన్స్ చేయడం లేదని శోభు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News