: టీడీపీ నేతలందరినీ మేము తిట్టడం లేదు: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు
ప్రధాని నరేంద్ర మోదీని వైఎస్సార్సీపీ అధినేత జగన్ కలిసిన విషయమై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ప్రధానిని జగన్ కలవడాన్ని ఏపీ బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు సమర్ధించడం విదితమే. ఈ నేపథ్యంలో ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, తామేమీ టీడీపీ నేతలందరినీ తిట్టడం లేదని, ఈ విషయమై విమర్శలు చేసిన ఆ పార్టీకి చెందిన ఒకరిద్దరు నేతలనే విమర్శించామన్నారు. ఆ విమర్శలపైనే రియాక్టు అయ్యాము తప్పా, టీడీపీపై తాము ఎలాంటి విమర్శలు చేయలేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నవారికి ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వాలంటే, టీడీపీ పర్మిషన్ తీసుకోవాలనేది ఆ పార్టీ నిర్ణయం అయితే కనుక, ఆ విషయాన్ని ఆ పార్టీ వారిని చెప్పమనండి.. అన్నారాయన.