: హిమాచల్ ప్రదేశ్ మంత్రి కరణ్ సింగ్ అంత్యక్రియలు


ఈ రోజు మరణించిన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర కో-ఆపరేషన్, ఆయుర్వేద శాఖ మంత్రి కరణ్ సింగ్ (60)  అంత్యక్రియలు ఆయన స్వస్థలమైన కులూలో ఈ సాయంత్రం జరిగాయి. అనారోగ్య కారణాలతో  ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయన ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. కొన్ని నెలలుగా అన్నవాహికకు సంబంధించిన కేన్సర్ తో ఆయన బాధపడుతున్నట్లు కరణ్ సింగ్ కుటుంబసభ్యులు చెప్పారు.

కరణ్ సింగ్ మృతిపై గవర్నర్ ఆచార్య దేవవ్రత్, సీఎం వీరభద్ర సింగ్ తదితరులు సంతాపం తెలిపారు. కాగా, కరణ్ సింగ్ కులూ రాయల్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. కరణ్ సింగ్ చిన్న సోదరుడు మహేశ్వర్ సింగ్ కులూ నియోజకవర్గానికి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. దాదాపు ఇరవై ఏడేళ్ల పాటు బీజేపీలో ఉన్న కరణ్ సింగ్, 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2015లో సీఎం వీరభద్రసింగ్ తన కేబినెట్ లో చోటిచ్చారు.

  • Loading...

More Telugu News