: షారూక్ నోట ‘బాహుబలి’ మాట!


బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ నోట ‘బాహుబలి’ మాట వచ్చింది. ముంబయిలోని ఓ మాల్ లో ఐనాక్స్ ఇన్ సిగ్నియా థియేటర్స్ ను ప్రారంభించారు. అనంతరం, షారూక్ మాట్లాడుతూ, తాను చిన్న వయసులో ఉన్నప్పుడు మంచి చిత్రాలు విడుదలయ్యేవని, కానీ, మంచి థియేటర్లు మాత్రం ఉండేవి కాదని అన్నారు. ప్రస్తుతం అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన ఎన్నో మంచి థియేటర్లు అందుబాటులో ఉన్నా, ఆ థియేటర్ల స్థాయికి తగ్గ సినిమాలు మాత్రం రావట్లేదని అన్నారు. మిగిలిన థియేటర్లలో కన్నా ఈ తరహా థియేటర్లలో ‘బాహుబలి’ వంటి అద్భుతమైన చిత్రాలను చూస్తే చాలా బాగుంటాయని అన్నారు.

  • Loading...

More Telugu News