: చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన శివనాడార్
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై హెచ్సీఎల్ చైర్మన్ శివనాడార్ ప్రసంశలు కురిపించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్ ఈ రోజు శివనాడార్ ను కలిశారు. ఏపీ లో హెచ్సీఎల్ ఏర్పాటుకు సంబంధించి ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా ఇందుకు సంబంధించిన అనుమతి పత్రాలను శివనాడార్ కు లోకేష్ అందజేశారు. అనంతరం శివనాడార్ మాట్లాడుతూ, అందరికంటే ముందు ఐటీ రంగాన్ని ప్రోత్సహించిన నాయకుడు చంద్రబాబు అని, విజన్ ఉన్న నాయకుడని ప్రశంసించారు. పలు సందర్భాల్లో చంద్రబాబును తాను కలిశానని, ఉద్యోగాల కల్పనే ప్రధాన ఎజెండా అని ఆయన చెబుతుండేవారని అన్నారు.