: కేసీఆర్ కు అవే ఉరితాళ్లుగా మారుతాయి: సీపీఐ నేత నారాయణ


రైతుల పట్ల టీఆర్ఎస్ సర్కారు నిరంకుశంగా వ్యవహరిస్తోందని సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. అన్నదాతకు సంకెళ్లు వేసి, కోర్టులో హాజరుపరచడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నతల్లిని రోడ్డుపై నిలబెట్టి అవమానిస్తే ఎలా ఉంటుందో... అన్నదాతలకు సంకెళ్లు వేసినా అలాగే ఉంటుందని చెప్పారు. సంకెళ్లు వేసి తీసుకెళ్లడానికి రైతులేమైనా దొంగలా? దోపిడీదారులా? అని ప్రశ్నించారు. రైతులకు వేసిన సంకెళ్లే ముఖ్యమంత్రి కేసీఆర్ పాలిట ఉరితాళ్లుగా మారుతాయని అన్నారు. రైతుల వద్ద నుంచి క్వింటా మిర్చిని రూ. 5 వేలకు కూడా కొనడం లేదని...  అదే బహిరంగ మార్కెట్లో అయితే రూ. 30 వేలకు అమ్ముతున్నారని తెలిపారు. న్యాయం కోసం పోరాడుతున్న రైతులను కాపాడాల్సింది పోయి... సంకెళ్లు వేసి అవమానిస్తారా? అంటూ మండిపడ్డారు.

  • Loading...

More Telugu News