: దాడిపై విచారణకు ఆదేశం.. ఖైదీ పరిస్థితి విషమం
శ్రీనగర్ లోని కోట్ బల్వాల్ జైలులో పాక్ ఖైదీపై భారత ఖైదీల దాడిని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం తీవ్రంగా తీసుకుంది. ఘటనపై విచారణకు ఆదేశించడంతోపాటు, జైలు సూపరింటెండెంట్, సిబ్బందిని సస్పెండ్ చేసింది. మరోవైపు తీవ్రగాయాలపాలైన ఖైదీ సనావుల్లా పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స కోసం ప్రభుత్వం చండీగఢ్ కు తరలించింది.