: బార్ వ్యాపారం చూసుకుంటూ బిజీబిజీగా ఉన్న హీరోయిన్ ప్రణీత
తన అందచందాలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్ ప్రణీతకి ప్రస్తుతం టాలీవుడ్‌లో అంతగా అవకాశాలు రావడం లేదన్న విషయం తెలిసిందే. అయితే, తన మాతృ పరిశ్రమ అయిన కన్నడలో మాత్రం ఈ అమ్మడికి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఈ భామ సినిమాల్లోనే కాదు బిజినెస్‌లోనూ రాణించాలనుకుంటోంది. ప్రస్తుతం వ్యాపారంలోనూ బిజీగా ఉన్న ఆమె.. హోటల్ కం బార్ వ్యాపారాన్ని చూసుకుటోంది.
దీనిని చెయిన్ బిజినెస్ విధానంలో దేశమంతా విస్తరించాలని ప్రణాళికలు రూపొందించుకుంటోంది. పలు నగరాల్లో బ్రాంచీలు ఓపెన్ చేసేందుకు ప్రయత్నాలు జరుపుతోంది. ఈ సందర్భంగా మీరు నిర్మాతగా మారుతారా? అన్న ప్రశ్నకు ప్రణీత సమాధానం చెబుతూ... ఇప్పటికిప్పుడు తన వద్ద నిర్మాత అయ్యేంత డబ్బు లేదని చెప్పింది. 'ఇప్పుడే వ్యాపారం మొదలైంది కదా, భవిష్యత్తులో నిర్మాతనవుతానేమో?' అంటూ నవ్వేసింది.