: ‘దాదా సాహెబ్ ఫాల్కే’గ్రహీత విశ్వనాథ్ ను అభినందించిన సినీ నటులు


దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, ప్రఖ్యాత దర్శకుడు కె.విశ్వనాథ్ కు టీడీపీ ఎంపీ, సీనియర్ నటుడు మురళీమోహన్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు శివాజీరాజా, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ అభినందించారు. హైదరాబాద్ లోని విశ్వనాథ్ స్వగృహానికి వీరంతా వెళ్లారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ దంపతులకు శాలువాలు కప్పి సత్కరించారు. అనంతరం, శ్రీకాంత్ మాట్లాడుతూ, షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల విశ్వనాథ్ గారిని కలవడం ఆలస్యమైందని అన్నాడు. విశ్వనాథ్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.

  • Loading...

More Telugu News