: సోషల్ మీడియాను ఆకట్టుకుంటున్న వెడ్డింగ్ డాన్స్ వీడియో
వివాహ వేడుకల్లోని సంగీత్ సందర్భంగా వరుడు, వధువు, బంధువులు డాన్స్ చేయడం సర్వసాధారణం. కొన్ని చోట్ల ఇది సంప్రదాయం కూడాను. దీనిని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు యువతీ యువకులు. ఈ నేపథ్యంలో పెళ్లి, రిసెప్షన్ లో కూడా చిందేస్తున్నారు. అలా అమెరికాలోని న్యూయార్క్ కు చెందిన పాయల్ కడాకియా పుజ్జి అనే యువతి తన వివాహ రిసెప్షన్ లో చేసిన డాన్స్ సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మైనే ప్యార్ కియా సినిమాలోని పాటతో పాటు, షారూఖ్ రబ్ నే బనాదీ జోడీ సినిమాలోని పాటకు నవ వధువు చేసిన డాన్స్ కు లైకులు వెల్లువెత్తాయి. సుమారు 15 లక్షల మంది ఆమె వీడియోను వీక్షించారంటే ఆమె డాన్స్ ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ఆమె డాన్స్ చేసిన వీడియో మీ కోసం.