: నరేంద్ర మోదీ ప్రభావం... చైనా రిక్వెస్ట్ కు 'నో' చెప్పిన శ్రీలంక!


కొలంబోకు సమీపంలో తమ సబ్ మెరైన్ ను దాచి వుంచేందుకు చైనా అనుమతులు కోరగా, శ్రీలంక దాన్ని తిరస్కరించింది. ప్రధాని నరేంద్ర మోదీ లంక పర్యటనకు బయలుదేరిన వేళ, చైనా రిక్వెస్ట్ కు 'నో' చెప్పినట్టు లంక ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భారత సార్వభౌమత్వానికి, మోదీ గౌరవానికి ఎటువంటి లోటూ రానివ్వకూడదన్న ఉద్దేశంతోనే ఈ నెలారంభంలో చైనా చేసిన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించలేదని, ఇది సున్నితమైన అంశం కాబట్టి, ఈ నిర్ణయం అధికారికంగా వెల్లడి కాలేదని పేరును తెలిపేందుకు ఇష్టపడని ఓ అధికారి వెల్లడించారు.

కాగా, అక్టోబర్ 2014లో తమ నౌకాశ్రయాల్లో చైనా సబ్ మెరైన్లను పార్క్ చేసుకునేందుకు లంక ప్రభుత్వం అనుమతినిచ్చి విమర్శలు కొని తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇదిలావుండగా, మోదీ పర్యటన ముగిసిన తరువాత, చైనా సబ్ మెరైన్ పై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని రక్షణ శాఖ అధికారి ఒకరు పేర్కొనడం గమనార్హం.

  • Loading...

More Telugu News