: ఇన్ఫోసిస్ ఉద్యోగులకు చేదు వార్త.. జీతాల పెంపు వాయిదా!


భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు మరో చేదు వార్త. ఇప్పటికే ఉద్యోగులను తొలగించే క్రమంలో తీవ్ర భయాందోళనలను రేకెత్తిస్తున్న ఇన్ఫోసిస్... మరో కీలక నిర్ణయం తీసుకుంది. జీతాల పెంపు ఇప్పటికిప్పుడు ఉండదని... జూలై వరకు జీతాల పెంపును వాయిదా వేస్తున్నామని ఆ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యూబీ ప్రవీణ్ రావు ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. సీనియర్ ఉద్యోగులకైతే జీతాల పెంపు మరింత ఆలస్యం అవుతుందని ఆయన అన్నారు. నిర్వహణ వ్యయాలను తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఉద్యోగుల తొలగింపుకు మాత్రం తాము ఎలాంటి ప్లాన్ చేయడం లేదని ఆయన అన్నారు. అయితే, పర్ఫార్మెన్స్ ఆధారంగా కొందరిని మాత్రం తొలగించాల్సి ఉంటుందని చెప్పారు. మంచి పనితీరు కనబరచని వారు సంస్థ నుంచి వైదొలగాల్సి ఉంటుందని అన్నారు.

  • Loading...

More Telugu News