: పెళ్లి సందడిలో విషాదం... డాన్స్ చేస్తూ కుప్పకూలిపోయిన వరుడు...వీడియో చూడండి!
వివాహవేడుకలో డాన్స్ చేస్తున్న వరుడు అకస్మాత్తుగా కుప్పకూలిన ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే... గుజరాత్ లోని రనోలికి చెందిన సూరజ్ సోలంకి (23) కి సమీప గ్రామంలోని యువతితో వివాహం జరిగింది. వివాహానంతరం స్నేహితులు, బంధువులతో బరాత్ లో సూరజ్ సోలంకి పాల్గొన్నాడు. పెళ్లి జరిగిన ఆనందంలో విపరీతంగా డాన్స్ చేశాడు.
స్నేహితుడి భుజాలపై కూర్చుని ఉత్సాహంగా డాన్స్ చేస్తూ తలవాల్చేశాడు. దీంతో భుజాలపైనుంచి అతని స్నేహితుడు కిందికి దించి సపర్యలు చేయగా, ఎలాంటి స్పందన కనిపించలేదు. దీంతో అతనిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించగా, తీవ్ర గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తెలిపారు. దీంతో వివాహానికి హాజరైన బంధుమిత్రులు షాక్ కు గురయ్యారు. దీంతో అంతా విషాదంలో మునిగిపోయారు.
<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/THLszdFVb7I" frameborder="0" allowfullscreen></iframe>