: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేటు ఆసుపత్రి ‘మయో’ను ఏపీకి రప్పించేందుకు చంద్రబాబు యత్నాలు!
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేటు ఆసుపత్రిగా ఖ్యాతిగాంచిన అమెరికా రోచెస్టర్‌లోని మయో క్లినిక్ విభాగాలను తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏర్పాటు చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారు. మయో క్లినిక్‌లో 4500 మంది ఫిజీషియన్లు, 57 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ క్లినిక్‌కు 128 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న ఈ క్లినిక్ వైద్య రంగంలో విస్తృత పరిశోధనలు నిర్వహిస్తోంది. ఒక్క పరిశోధనల కోసమే ఏటా 600 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంది. కాగా, ఇదే ఆసుపత్రిలో కేన్సర్ చికిత్స పొందుతున్న సీనియర్ నేత దేవేందర్‌గౌడ్‌ను పరామర్శించేందుకు వెళ్లిన చంద్రబాబు మయో క్లినిక్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో మయో సేవలు అందించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది.