: హైదరాబాద్‌లో రిజర్వ్‌బ్యాంక్ అధికారిణి ఆత్మహత్య


హైదరాబాద్‌లో రిజర్వ్ బ్యాంకు ఉద్యోగిని ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎస్సార్‌నగర్ పోలీసుల కథనం ప్రకారం.. కోల్‌కతాకు చెందిన నితిన్ జైన్ (32), శ్వేతాజైన్ (32) దంపతులు. ఉద్యోగరీత్యా రెండు నెలల కిందట నగరానికి వచ్చారు. అమీర్‌పేట లాల్‌బంగ్లా ఎదురుగా ఉన్న నాబార్డ్ వసతి గృహాల్లో ఉంటున్నారు. నితిన్ నాబార్డ్‌లో అసిస్టెంట్ మేనేజర్ కాగా, శ్వేత రిజర్వ్ బ్యాంక్ ఉద్యోగిని.  కుటుంబ విషయాలపై ఇటీవల శ్వేత భర్తతో గొడవ పడింది. గురువారం సాయంత్రం ఆ గొడవ కాస్తా ముదరడంతో తీవ్రమనస్తాపం చెందిన శ్వేత ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News