: ముగిసిన చంద్రబాబు అమెరికా టూర్.. ఏడు రోజుల్లో ఏడువేల కిలోమీటర్లు చుట్టేసిన ఏపీ సీఎం


పెట్టుబడుల వేట కోసం అమెరికా వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి పర్యటన ముగిసింది. శుక్రవారం ఆయన రాష్ట్రానికి చేరుకోనున్నారు. బాబు తన పర్యటనలో ఏడు రోజుల్లో ఏకంగా ఏడువేల కిలోమీటర్లు పర్యటించడం విశేషం. అమెరికాలో మొత్తం 15 నగరాల్లో పర్యటించిన ఆయన 30కిపైగా సమావేశాల్లో పాల్గొన్నారు. 90కిపైగా ప్రముఖ కంపెనీల ప్రముఖులను, ప్రతినిధులను కలిసి రాష్ట్రానికి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మూడు రాష్ట్రాలతో బాబు బృందం ఒప్పందాలు కుదుర్చుకుంది. యాపిల్, గూగుల్, సిస్కో, క్వాల్‌కమ్, మోసెర్, జోహో, టెంపుల్టన్, ఫ్రాంక్లిన్ తదితర కంపెనీలు ఏపీకి వస్తామని మాటిచ్చాయి. ఈవీఎక్స్  సొల్యూషన్స్, ఇన్నోవా సొల్యూషన్స్‌తో ఒప్పందాలు కుదిరాయి. కాగా, తన పర్యటన వల్ల ఏపీకి మొత్తం 12,500 ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడిందని ముఖ్యమంత్రి తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News