: టీచర్ల ఏకీకృత సర్వీసుకు కేంద్ర న్యాయశాఖ ఆమోదం


టీచ‌ర్ల ఏకీకృత స‌ర్వీసుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. టీచర్లు ఎంతో కాలంగా కోరుతున్న ఏకీకృత సర్వీసు నిబంధ‌న‌ల‌ అమ‌లుకు కేంద్ర న్యాయ‌శాఖ‌ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఎమ్మెల్సీలు జనార్దన్‌ రెడ్డి, పూల రవీందర్‌ లు మాట్లాడుతూ, న్యాయశాఖ ఆమోదించిన టీచర్ల ఏకీకృత సర్వీసు దస్త్రాలను అక్కడి నుంచి హోం శాఖకు పంపిందని తెలిపారు. న్యాయశాఖ ఆమోద ముద్ర వేయడంతో హోం శాఖ ఆ దస్త్రాన్ని పరిశీలించి, ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపుతుందని అన్నారు. రాష్ట్రపతి ఆమోదముద్ర పడిన వెంటనే...ఎంతో కాలంగా టీచర్లు ఆశగా ఎదురు చూస్తున్న ఏకీకృత సర్వీసు నిబంధన అమలులోకి వస్తుందని వారు వెల్లడించారు. 

  • Loading...

More Telugu News