: శ్రీలంకకు రావడం ఆనందంగా ఉంది: ప్రధాని మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ కొంచెం సేపటి క్రితం శ్రీలంకకు చేరుకున్నారు. కొలంబో ఎయిర్ పోర్టులో మోదీకీ ఆ దేశ ప్రధాని రణిల్ విక్రమ సింగే ఘన స్వాగతం పలికారు. కొలంబోలోని సీమా మాలాక ఆలయాన్ని సందర్శించడం ద్వారా మోదీ తన పర్యటనను ప్రారంభించారు. కాగా,రెండు రోజుల పర్యటన నిమిత్తం శ్రీలంకకు వెళ్లిన ప్రధాని, బౌద్ధులు నిర్వహించే అంతర్జాతీయ వేసక్ ఉత్సవాల్లో పాల్గొంటారు. మోదీ సందర్శించనున్న బౌద్ధ ఆలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు.