: మన జనాభా ఎంత బాసూ..?
రాష్ట్రంలోని మొత్తం జనాభా, గ్రామం, పట్టణంలో ఎంతెంత, ఎస్సీ, ఎస్టీ జనాభా ఎంత ఇలాంటి వివరాలతో తుది గణాంకాలు విడుదలయ్యాయి. 2011 లెక్కల ప్రకారం రూపొందించిన వీటిని జనగణన విభాగం డైరెక్టర్ అనూరాధ ఈ రోజు హైదరాబాద్ లో విడుదల చేశారు. స్త్రీలు, పురుషులు, అక్షరాస్యులు, నిరక్షరాస్యులు, ఉపాధి పొందుతున్న వారు, నిరుద్యోగులు ఇలా భిన్న వర్గాల గణాంకాలు వీటిలో ఉన్నాయి.
రాష్ట్ర జనాభా 8,45,80,777. ఇందులో పట్టణాలలో 2,82,19,075, గ్రామీణ ప్రాంతాలలో 5,63,61,702 మంది ఉన్నారు. అత్యధిక జనాభాతో రంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఇక్కడ 52,96,741 మంది ఉన్నారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 23,44,474 మంది ఉన్నారు. విశాఖ జిల్లా పెదగంట్యాడలో జనాభా పెరుగుదల రేటు అధికంగా ఉంది. ఎస్సీల జనాభా 1,38,78,078, ఎస్టీల జనాభా 59,18,073.