: నిషిత్ ప్రమాదానికి గురైన కారు నాది కాదు!: పవన్ కల్యాణ్ స్పష్టీకరణ
ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ ప్రమాదానికి గురైన మెర్సిడెస్ బెంజ్ స్పోర్ట్స్ కారు తనది కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఈరోజు హైదరాబాదులో పవన్ కల్యాణ్ ను ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు కలిశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కు వీరు పలు ప్రశ్నలను సంధించారు. నిషిత్ ప్రమాదానికి గురైన కారు మీదేనట కదా? అని ఒక విద్యార్థి అడగగా పవన్ ఈ విధంగా స్పందించారు.
ఇలాంటి కారు గతంలో తన వద్ద ఉండేదని ఆయన అన్నారు. అయితే, ఆ కారు ఇన్ స్టాల్ మెంట్లు కట్టలేక చివరకు దాన్ని అమ్మేశానని చెప్పారు. నిషిత్ ప్రమాదానికి గురైన కారు ఫొటోను తనకు ఈ ఉదయం ఒకరు చూపించారని... అయితే, తాను కొన్న కారు నెక్స్ట్ మోడల్ కారు ఆయనదని పవన్ చెప్పారు. నిషిత్ ప్రమాదానికి గురైన కారు పవన్ దే అంటూ... సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.