: ఏపీ భవన్ విషయంలో ఘర్షణ అనవసరం: ఎంపీ వినోద్


ఢిల్లీలోని ఏపీ భవన్ విషయంలో ఎవరూ అనవసరంగా ఘర్షణ పడాల్సిన అవసరం లేదని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. కొత్త భవనాన్ని నిర్మించే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉందని చెప్పారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. కేంద్రమంత్రి సంతోష్ గాంగ్వర్ తో వినోద్ ఈ రోజు భేటీ అయ్యారు. అనంతంరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలను వెల్లడించారు. తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ పేరును తెలంగాణ గ్రామీణ బ్యాంక్ గా మార్చాలని మంత్రిని కోరినట్టు ఆయన తెలిపారు. తెలంగాణలో ఒకే గ్రామీణ బ్యాంక్ ఉండాలన్నదే తమ కోరిక అని మంత్రికి తెలిపినట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News