: కురచ దుస్తుల్లో హీరోయిన్లను చూసేందుకే సినిమాలకు వస్తారన్న నెటిజన్ వ్యాఖ్యలపై మండిపడ్డ హీరోయిన్
నాగచైతన్య హీరోగా నటించిన 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన మలయాళీ భామ మంజిమ మోహన్ నెటిజన్ కు ఘాటు సమాధానం చెప్పింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మంజిమ మోహన్ అభిమాని ఒకరు 'కురచ దుస్తుల్లో కనువిందే చేసే హీరోయిన్లను చూసేందుకే ప్రేక్షకులు సినిమాలకు వస్తార'ని వ్యాఖ్యానించాడు. దీనిపై మండిపడ్డ మంజిమా మోహన్ అతనికి ‘జనం థియేటర్లకు వచ్చేది హీరోయిన్లను నగ్నంగానో, కురచ దుస్తుల్లోనో చూడ్డానికేనని మీరు భావిస్తే అది చాలా తప్పుడు అభిప్రాయం. మంచి సినిమాలను ఆస్వాదించేందుకే ప్రజలు థియేటర్లకు వస్తారు’ అంటూ సమాధానం చెప్పింది.