: మద్దతిస్తామని మాత్రమే జగన్ చెప్పారు.. కలుస్తామని చెప్పలేదు: పెద్దిరెడ్డి


తమ అధినేత జగన్ ఢిల్లీ పర్యటనను టీడీపీ నేతలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే బలపరిచిన అభ్యర్థికి తాము మద్దతిస్తామని మాత్రమే జగన్ చెప్పారని... బీజేపీతో కలుస్తామని చెప్పలేదని అన్నారు. ఏపీ మంత్రులకు జగన్ ఫోబియా పట్టుకుందని ఎద్దేవా చేశారు.

కుమారుడిని కోల్పోయిన మంత్రి నారాయణ కుటుంబాన్ని పరామర్శించకుండా... జగన్ పై విమర్శలు గుప్పించడానికి టీడీపీ నేతలంతా సమయాన్ని కేటాయిస్తున్నారని విమర్శించారు. మరోవైపు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, జగన్ ను విమర్శించే స్థాయి దేవినేని ఉమ, అచ్చెన్నాయుడులకు లేదని అన్నారు. రాష్ట్ర సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళితే... టీడీపీ నేతలు ఎందుకు కంగారు పడుతున్నారని ఆయన ప్రశ్నించారు.


  • Loading...

More Telugu News