: భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన టెక్ మహీంద్రా


అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దెబ్బకు భారతీయ ఐటీ కంపెనీలు, ఐటీ ఉద్యోగులు తల్లడిల్లుతున్నారు. దాదాపు అన్ని సంస్థలు తమ ఉద్యోగులను గణనీయంగా తగ్గించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులందరూ ఎవరికి ఎప్పుడు పింక్ స్లిప్ వస్తుందో అన్న భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్ బాటలోనే ఇప్పుడు టెక్ మహీంద్ర కూడా అడుగువేసింది. ఈ ఒక్క నెలలోనే వెయ్యి మందికి ఈ సంస్థ ఉద్వాసన పలికింది. అయితే, ఇది రెగ్యులర్ గా జరిగే పనేనని... పనితీరు ఆశించినంతగా లేని ఉద్యోగులను తొలగించడం మామూలేనని ఈ సంస్థ తెలిపింది. ప్రధానంగా 10 నుంచి 15 సంవత్సరాల అనుభవం ఉన్న ఉద్యోగులనే కంపెనీలు టార్గెట్ చేస్తున్నాయి. ఏదో ఒక కారణం చూపి వీరిని తప్పించే ప్రయత్నం చేస్తున్నాయి. 

  • Loading...

More Telugu News