: 'నా వరకు ఇది దుర్వార్తే'నన్న ఆన్నా హజారే!
తన వరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై అవినీతి ఆరోపణలు రావడం దుర్వార్తేనని ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే తెలిపారు. రాలెగావ్ లో ఆయన మాట్లాడుతూ, తామిద్దరం కలిసి పోరాడిన రోజుల్లో తమ లక్ష్యం ఒక్కటేనని అన్నారు. దేశంలో ఏళ్లుగా పాతుకుపోయిన భ్రష్టాచార్ (అవినీతి) ను రూపుమాపడమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు.
అలాంటి ఉన్నత లక్ష్యంతోనే తాము కలిసి పోరాటం చేశామని, పెద్ద ఆందోళన నిర్వహించామని ఆయన అన్నారు. అలాంటి అరవింద్ కేజ్రీవాల్ పై అవినీతి ఆరోపణలు రావడం తనవరకు బాధాకరమైన విషయమని ఆయన చెప్పారు. అయితే దీనిపై స్పష్టమైన సమాచారం లేకుండా.. ఆరోపణలమీద ఆధారాపడి ఆయనను దోషిగా వ్యాఖ్యానించనని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఆరోపణలు సహజమని, అవి నిరూపితమవ్వాలని ఆయన సూచించారు. అవినీతికి తాము వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు.