: ఓదారుస్తున్న మంత్రులతో నారాయణ చెప్పిన ఒకేఒక మాట!


"దేవుడు చేసిన అన్యాయమిది. మనమేం చేయలేము" తనను ఓదార్చడానికి ప్రయత్నిస్తున్న మంత్రులతో మంత్రి నారాయణ చెప్పిన ఒకే మాట ఇది. చంద్రబాబుతో పాటు అమెరికా పర్యటనలో ఉన్న మంత్రులు మినహా, మిగతా అందరు ఏపీ మంత్రులు నారాయణను ఓదార్చి, కష్టకాలంలో అండగా నిలిచేందుకు నెల్లూరు వచ్చారు. ఆయన వియ్యంకుడు, మంత్రి గంటా శ్రీనివాస్ ఎంతో దిగాలుగా కనిపించారు. నిషిత్ పార్థివ దేహానికి అంతిమయాత్ర మరికాసేపట్లో ప్రారంభం కానుండగా, వేలాది మంది అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం నిషిత్ దేహానికి సంప్రదాయ క్రతువు జరుగుతోంది. కుమారుడికి స్వయంగా ఆఖరి స్నానాన్ని ఆయన చేయిస్తుండగా, ఆయన బంధుమిత్రులు బోరున విలపించారు.

  • Loading...

More Telugu News