: ఎర్రచందనం స్మగ్లర్లతో సీఎం చంద్రబాబుకు ముప్పు.. హెచ్చరించిన నిఘా విభాగం!
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలపై రాష్ట్ర నిఘా విభాగం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎర్రచందనం స్మగ్లర్లతో చంద్రబాబుకు ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ఏపీ రెసిడెంట్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు ఢిల్లీ పర్యటనల్లో ఇకపై మెట్రో రైలులో ప్రయాణం మంచిది కాదని, జెడ్ ప్లస్ భద్రత ఉన్నప్పటికీ ‘మెట్రో’ ప్రయాణం ప్రమాదకరమని నిఘా విభాగం హెచ్చరించింది. ‘మెట్రో’లో సీఎంకు భద్రత కల్పించడం ఇబ్బందికరమని, ఢిల్లీ పర్యటనలో బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో, సాయుధ కమాండో రక్షణలో రోడ్డుమార్గం ద్వారానే చంద్రబాబును తీసుకువెళ్లాలని, ఉగ్రవాదులు, మత ఛాందసవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిఘా విభాగం హెచ్చరించింది.