: కపిల్ మిశ్రాపై పిడిగుద్దులు కురిపించిన ఆప్ కార్యకర్త !
ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ పై లంచం ఆరోపణలు చేసిన ఆ పార్టీ నేత కపిల్ మిశ్రాకు చేదు అనుభవం ఎదురైంది. ఆయనపై ఆ పార్టీకి చెందిన కార్యకర్త పిిడిగుద్దులు కురిపించారు. ఢిల్లీలో ఈ రోజు కపిల్ మిశ్రా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆ ప్రాంతం వద్దకు ఆప్ కార్యకర్తలు కొంతమంది వెళ్లారు. అయితే, కపిల్ మిశ్రా మీడియాతో మాట్లాడేందుకు యత్నిస్తున్న సందర్భంలో ఆయనపై అంకిత్ భరద్వాజ్ అనే కార్యకర్త పిడిగుద్దులు గుద్దాడు.