: రంకె వేసిన బుల్.. రికార్డు స్థాయికి సెన్సెక్స్, నిఫ్టీ
భారతీయ స్టాక్ మార్కెట్లలో బుల్ రంకె వేసింది. సెన్సెక్స్, నిప్టీలు ఆల్ టైమ్ హై స్థాయిలో ముగిశాయి. ఈసారి రుతుపవనాలు మంచి స్థాయిలో ఉంటాయని... సాధారణంతో పోలిస్తే 50 శాతం వర్షపాతం అధికంగా ఉంటుందనే అంచనాలతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ పెరిగి, కొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 315 పాయింట్లు లాభపడి 30,248కి పెరిగింది . నిఫ్టీ 90 పాయింట్లు ఎగబాకి 9,407కు చేరుకుంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్...
మార్క్ శాన్స్ ఫార్మా (12.46%), నెట్ వర్క్ 18 మీడియా (8.94%), భారతీ ఎయిర్ టెల్ (7.87%), కేఈసీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (7.22%), సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ (6.29%).
టాప్ లూజర్స్...
దేనా బ్యాంక్ (-5.38%), ఐడీబీఐ బ్యాంక్ (-4.82%), బయోకాన్ (-4.06%), సియట్ (-3.45%), డిష్ టీవీ ఇండియా (-3.15%).