: ఢిల్లీ మెట్రో రైల్లో ప్రయాణించిన జగన్!
వైసీపీ అధినేత జగన్ ఈ రోజు ఢిల్లీ మెట్రో రైల్లో ప్రయాణించారు. ప్రధాని మోదీతో భేటీ అయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన జగన్... విమానాశ్రయం నుంచి శివాజీ స్టేడియం వరకు మెట్రో రైల్లో వెళ్లారు. ఆ తర్వాత అక్కడ నుంచి ప్రధాని నివాసానికి కారులో వెళ్లారు. ఈ సందర్భంగా జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డిలు ఉన్నారు. అనంతరం మోదీతో భేటీ అయిన జగన్ రాష్ట్ర సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్, రైతు సమస్యలపై చర్చించారు.