: అపోలో ఆసుపత్రిలో నిషిత్ కు ఉస్మానియా వైద్యుల పోస్ట్ మార్టం.. నెల్లూరులో రేపు అంత్యక్రియలు


ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్, అతని స్నేహితుడు రవివర్మల మృత దేహాలకు పోస్ట్ మార్టం పూర్తయింది. అపోలో మెడికల్ కాలేజీలోని మార్చురీలో ఉస్మానియా వైద్యులు పోస్ట్ మార్టం నిర్వహించారు. కాసేపట్లో నిషిత్ భౌతికకాయాన్ని నెల్లూరుకు తరలించనున్నారు. రేపు నెల్లూరులో అతనికి అంత్యక్రియలు జరగనున్నాయి. ఆ ఏర్పాట్లను ఇప్పటికే నెల్లూరులో ప్రారంభించారు. విదేశాల్లో చదువుకున్న నిషిత్... నారాయణ విద్యాసంస్థలకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

  • Loading...

More Telugu News