: అర్ధరాత్రి ముంబైలో దిగిన పాప్ గాయకుడు బీబర్... పోటెత్తిన అభిమానులు


చిన్న వయసులోనే పాప్ స్టార్ గా ఎదిగి, ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను ఆటపాటలతో అలరిస్తున్న కెనెడియన్ పాప్ తరంగం జస్టిన్ బీబర్ తొలిసారి భారత్ వచ్చాడు. అర్ధరాత్రి ముంబైలోని శివాజీ అంతర్జాతీయ టెర్మినస్ కు ప్రత్యేక విమానంలో చేరుకున్నాడు. ఈ సందర్భంగా జస్టిన్ బీబర్ ను చూసేందుకు అభిమానులు చాలా ఉత్సాహం చూపారు. అయితే బీబర్ ఎవరికీ కనిపించకుండా మరో మార్గంలో హోటల్ కు వెళ్లిపోవడం విశేషం. ఐదు రోజుల భారత పర్యటనలో జస్టిన్ బీబర్... నేటి సాయంత్రం డీవై పాటిల్ స్టేడియంలో ప్రదర్శన ఇవ్వనున్నాడు. దానితోపాటు నేడు 'కాఫీ విత్ కరణ్' షోలో పాల్గొంటాడు. అనంతరం జైపూర్, ఢిల్లీలలో పర్యటిస్తాడు.

  • Loading...

More Telugu News