: లండన్ నుంచి బయల్దేరిన మంత్రి నారాయణ
గత పది రోజులుగా లండన్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ.. తనయుడి మరణ వార్త వినడంతో, హుటాహుటీన హైదరాబాదు బయల్దేరారు. ఈ ఉదయం బంధువుల నుంచి తన కుమారుడి దుర్మరణ వార్త విన్న ఆయన, తీవ్ర ఉద్వేగానికి లోనై... హుటాహుటీన బయల్దేరారు. కాగా, హైదరాబాదు లోని జూబ్లిహిల్స్ లో రోడ్ నెంబర్ 36 లో మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టి ధ్వంసమైన బెంజ్ కారు ప్రమాదంలో నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెను విషాదంతో ఆయన లండన్ నుంచి బయల్దేరారు.