: హైదరాబాదులోని అపోలో ఆసుపత్రికి చేరుతున్న మంత్రి నారాయణ బంధువులు


హైదరాబాదులోని జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 36 లో మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టిన కారు (నెంబర్ టీఎస్ 07 ఎస్ కే 7117) ప్రమాదంలో మృతి చెందిన మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ, అతని స్నేహితుడు రాజా రవివర్మల భౌతికకాయాలు అపోలో ఆసుపత్రిలో ఉండడంతో బంధువులు ఆసుపత్రికి చేరుతున్నారు. ఈ ఆకస్మిక ఘటనతో వైజాగ్ నుంచి హైదరాబాదుకు నారాయణ వియ్యంకుడు మంత్రి గంటా శ్రీనివాసరావు హుటాహుటీన బయల్దేరారు. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప రాజమండ్రి నుంచి హైదరాబాదు బయల్దేరారు. నారాయణ సన్నిహితులు పలువురు హైదరాబాదు పయనమయ్యారు. మరోవైపు సీఎం చంద్రబాబు అమెరికా పర్యటనలో ఉండగా, నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. దీంతో హైదరాబాదులోని టీడీపీ శ్రేణులు అపోలో ఆసుపత్రికి చేరుకుంటున్నాయి. మరోవైపు అపోలో ఆసుపత్రిలో మృతదేహాలకు సంబంధించిన ప్రాధమిక కార్యక్రమాలు పూర్తి చేసి, వారి స్వస్థలాలకు పంపనున్నారు.

  • Loading...

More Telugu News