: తమిళనాడులో బీజేపీ నాయకుడి ఇంటిపై బాంబు దాడి!


తమిళనాడుకు చెందిన బీజేపీ నాయకుడు ముత్తురామన్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు బాంబు దాడికి పాల్పడ్డారు. దేవకొట్టైలోని ఆయన ఇంటిపై పెట్రోలు బాంబు వేసినట్టు పోలీసులు చెప్పారు. ఈ రోజు ఉదయం ఈ సంఘటన జరిగిందని, బాంబు తీవ్రతకు ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయని, ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు. కాగా, తమిళనాడులో బీజేపీ అభివృద్ధి విభాగానికి రాష్ట్ర కార్యదర్శిగా ఆయన ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు.

  • Loading...

More Telugu News