: లగడపాటి పెప్పర్ స్ప్రే కేసును కొట్టేసిన సుప్రీంకోర్టు


రాష్ట్ర విభజన సమయంలో లోక్ సభలో చోటు చేసుకున్న పెప్పర్ స్ప్రే ఉదంతం యావత్ దేశాన్ని షాక్ కు గురి చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును సుప్రీంకోర్టు నేడు కొట్టి వేసింది. అప్పుడు జరిగిన లోక్ సభ సమావేశాల్లో ఏపీ ఎంపీలు, తెలంగాణ ఎంపీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై మరొకరు భౌతిక దాడులకు పాల్పడే వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో, లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే చేశారు. దీంతో, తనపై పెప్పర్ స్ప్రేతో దాడి చేశారంటూ లగడపాటిపై పొన్నం ప్రభాకర్ కేసు వేశారు. ఈ కేసును ఈ రోజు సుప్రీంకోర్టు కొట్టివేసింది. 

  • Loading...

More Telugu News