: నా సినిమా పేరు విని ప్రధాని మోదీ నవ్వేశారు: అక్షయ్ కుమార్
బాలీవుడ్ ప్రముఖ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. మర్యాద పూర్వకంగా ప్రధానిని కలిశానని అక్షయ్ కుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. అక్షయ్ సేవలను కొనియాడిన ప్రధాని మోదీ, అక్షయ్ తరువాతి ప్రాజెక్టు పేరు అడిగారు. దీంతో అక్షయ్ కుమార్ తన తరువాతి సినిమా విడుదలకు సిద్ధంగా ఉందని, ఈ సినిమా పేరు ‘టాయ్ లెట్-ఏక్ ప్రేమ్ కథా’ అని చెప్పగానే ప్రధాని గట్టిగా నవ్వేశారట.
మోదీ ప్రారంభించిన ‘స్వచ్ఛ భారత్’ క్యాంపెయిన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అనంతరం సినిమా గురించి ప్రధానికి అక్షయ్ తెలిపారు. అయితే ప్రధాని హాయిగా నవ్విన క్షణాలను మాత్రం మర్చిపోలేనని అక్షయ్ కుమార్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించాడు. ఈ సినిమాలో అక్షయ్ సరసన 'దమ్ లగాకే హైసా' (తెలుగులో 'సైజ్ జీరో') ఫేమ్... భూమి పెడ్నేకర్ నటిస్తోంది. జూన్ 2న ఈ సినిమా విడుదల కానుంది.