: ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం బాలయ్య అప్లై చేయడానికి కారణం ఇదే!
ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఇటీవలే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కు అప్లై చేశారు. ప్రస్తుతం ఆయన పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ 40 రోజుల పాటు పోర్చుగల్ లో జరగనుంది. ఈ సినిమాలో బాలయ్య గ్యాంగ్ స్టర్, ట్యక్సీ డ్రైవర్ పాత్రల్లో నటిస్తున్నారు. దీంతో, పోర్చుగల్ లో భారీ ఎత్తున డ్రైవింగ్ సీన్లు, ఛేజింగ్ సీన్లను షూట్ చేయనున్నారట. ఈ నేపథ్యంలోనే, బాలయ్య ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కు అప్లై చేశారట. వాస్తవానికి షూటింగ్ ల కోసం ఈ లైసెన్స్ అవసరం లేదు. కానీ, బాలయ్య ఎప్పటి నుంచో ఈ లైసెన్స్ తీసుకోవాలని భావిస్తున్నారట. దీంతో, రెండు రకాలుగా ఉపయోగపడుతుందనే భావనతో ఆయన ఈ లైసెన్స్ కు దరఖాస్తు చేసుకున్నారట.