: ఉగ్రవాదంలో చేరుతున్న కశ్మీరీ యువత.. గతేడాది 95 మంది చేరిక


కశ్మీర్ యువత ఉగ్రవాదంలో చేరడానికి ఉవ్విళ్లూరుతోంది. గతేడాది ఏకంగా 95 మంది యువకులు ఉగ్రవాదుల్లో వివిధ పోస్టుల్లో చేరినట్టు పోలీసులు తెలిపారు.  వారి చేరికతో లోయలోని ఉగ్రవాదుల సంఖ్య 200కు చేరుకున్నట్టు పేర్కొన్నారు. కశ్మీర్‌లో చురుగ్గా ఉన్న 200 మంది ఉగ్రవాదుల్లో 110 మంది స్థానికులు కాగా మిగిలినవారు విదేశీ ఉగ్రవాదులని కశ్మీర్ ఐజీ ఎస్‌జేఎం గిలానీ తెలిపారు. మిలిటెంట్ల ఏరివేతకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

కాగా, గత నెలలో ప్రభుత్వం సోషల్ మీడియాపై విధించిన నిషేధాన్ని నెల రోజుల తర్వాత ఎత్తివేయనున్నట్టు గిలానీ పేర్కొన్నారు. సోషల్ మీడియా అడ్డాగా సంఘ వ్యతిరేక శక్తులు చెలరేగి పోతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. పరిస్థితి సాధారణ స్థితికి చేరుకున్నాక సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేస్తామని గిలానీ వివరించారు.

  • Loading...

More Telugu News