: సన్ రైజర్స్ ఆశలను సజీవంగా నిలిపిన శిఖర్ ధావన్


ఐపీఎల్ సీజన్ 10లో నాకౌట్ పోటీల్లో పాల్గొనే ఆశలను సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు సజీవంగా ఉంచుకుంది. ఓపెనర్ శిఖర్ ధావన్ నాటౌట్  గా నిలిచి మరీ జట్టుకు విజయాన్ని అందించాడు. హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌ తో జరిగిన మ్యాచ్‌ లో సన్‌ రైజర్స్ హైదరాబాద్ జట్టు 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు పార్థివ్ పటేల్ (23), రోహిత్ శర్మ (67) రాణించడంతో 7 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన సన్ రైజర్స్ జట్టు ఆదిలోనే వార్నర్ వికెట్ కోల్పోయినప్పటికీ ధావన్ (62) హెన్రిక్వెస్ (44) ధాటిగా ఆడడంతో మరో పది బంతులు ఉండగానే 3 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. దీంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. దీంతో సన్ రైజర్స్ నాకౌట్ ఆశలు సజీవంగా ఉన్నాయి. మిగిలిన మ్యాచ్ లో విజయం సాధిస్తే...నాకౌట్ లో విజయవంతంగా అడుగుపెడుతుంది..పంజాబ్ ఓటమిపాలైనా సన్ రైజర్స్ నాకౌట్ దశకు చేరుకుంటుంది. 

  • Loading...

More Telugu News