: రూ.1.11 కోట్ల రుణాలిచ్చిన సిండికేట్ బ్యాంకు మేనేజర్ అరెస్ట్
తప్పుడు ధ్రువపత్రాల ఆధారంగా రూ.1.11 కోట్ల రుణాలు ఇచ్చిన సిండికేట్ బ్యాంకు మేనేజర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది సంగారెడ్డి జిల్లా ఝరాసంగం సిండికేట్ బ్యాంక్ బ్రాంచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అప్పట్లో బీఎంగా ఉన్న బాబురావు 66 మంది లబ్ధిదారులకు రూ.1.11 కోట్ల రుణాలు మంజూరు చేశారు. రుణాల కోసం రైతులు సమర్పించిన పాస్‌పుస్తకాలు, పహాణీలు నకిలీవని తర్వాత తేలింది. రైతులు అందించిన వాటిని కనీసం పరిశీలించకుండా బాధ్యతారహితంగా రుణాలు ఇచ్చినట్టు బాబురావుపై కేసు నమోదైంది. ప్రస్తుతం మాదాపూర్‌లోని సిండికేట్ బ్యాంకు శాఖలో పనిచేస్తున్న బాబురావును సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు.