: ఫ్రాన్స్ అధ్యక్షుడి ప్రాక్టీస్ ప్రసంగం.. పొరపాటున లైవ్‌లో ప్రసారం!
ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఇమ్మానియేల్ మేక్రాన్‌కు మొదట్లోనే ఊహించని ఘటన ఎదురైంది. అధ్యక్షుడిగా ఎంపికైన మేక్రాన్ తొలి ప్రసంగం ఇవ్వాల్సి ఉండడంతో ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? తదితర విషయాలపై స్టేజ్‌పై కాసేపు ప్రాక్టీస్ చేశారు. అయితే ఆయన ప్రాక్టీస్ ప్రసంగం పొరపాటున లైవ్‌లో టెలికాస్ట్ కావడంతో అదికాస్తా వైరల్ అయింది. మేక్రాన్ ప్రసంగాన్ని లైవ్ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన కెమెరాలు ముందుగా ఆన్ అయిపోవడంతో ఆయన ప్రాక్టీస్ లైవ్‌లోకి వచ్చేసింది. మేక్రాన్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మధ్యలో ఓ మహిళ వచ్చి మేకప్ వేయడం కూడా లైవ్‌లో ప్రసారం అయింది. ఇప్పుడీ వీడియో నెట్లో వైరల్ అవుతోంది.