: ముంబయ్ లో... కేవలం 'రూపాయి'కే ఖరీదైన వైద్యం!


ఈవేళ వైద్యం అన్నది ఎంతటి ఖరీదైన విషయమో అందరికీ తెలిసిందే. అలాంటి తరుణంలో 'రూపాయికే వైద్యం' అంటే ఎవరికైనా అనుమానం వస్తుంది. నిజమా? కలా? అని కూడా అనిపిస్తుంది. అయితే ఇది అక్షరాలా నిజం! ఇలాంటి ఆశ్చర్యానికి గురి చేస్తోంది ముంబైలోని ‘1 రూపీ క్లినిక్‌’. ఈ క్లినిక్ ను ముంబైకి చెందిన చెందిన వైద్యులు రాహుల్‌ ఘూలె.. అమోల్‌ ఘూలెలు ఏర్పాటు చేయనున్నారు. 24 గంటలు పని చేసే ఆ ఆసుపత్రి వారం రోజులూ పని చేస్తుంది.

అంతే కాకుండా ఈ ఆసుపత్రిలో చిన్నపాటి రుగ్మతల నుంచి అత్యవసర చికిత్సల వరకు వైద్యమందిస్తారు. నిత్యం ఎంబీబీఎస్‌ డాక్టర్లు అందుబాటులో ఉంటారు. అవసరాన్ని బట్టి చర్మ వ్యాధులు, డయాబెటీస్‌, ప్రసూతి స్పెషలిస్టులు కూడా అందుబాటులో ఉంటారు. ముంబైలోని కుర్లా, ఘట్‌ కోపర్‌, ములుంద్‌, వడల, దాదర్‌ తదితర 5 మెట్రో స్టేషన్ల వద్ద ఈ ఆసుపత్రులు మరో రెండు నెలల్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు, సేవలతో పాటు, మందులు కూడా సరసమైన ధరలకే ఇవ్వడం మరో విశేషం. ఈ రకమైన ఆసుపత్రులు ఏర్పాటు చేసేందుకు రాహుల్‌ ఘూలె, అమోల్‌ ఘూలెలకు ఉచితంగా స్థలం కేటాయించేందుకు రైల్వే శాఖ అంగీకరించింది.

  • Loading...

More Telugu News