: కేసీఆర్ కుడి కంటిలో పొర.. నేడు ఢిల్లీలో ఆపరేషన్!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుడి కంటికి నేడు ఢిల్లీలో ఆపరేషన్ జరగనుంది. ఆపరేషన్ నిమిత్తం శుక్రవారమే ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ చేరుకున్నారు. గతంలో కేసీఆర్ ఎడమ కంటికి ఆపరేషన్ చేసిన నేత్ర వైద్యుడు డాక్టర్ సచిదేవ్.. రెండో కంటికి కూడా ఆపరేషన్ చేయనున్నారు. మరోపక్క, ఢిల్లీలోనే ఉన్న కేసీఆర్ తనయుడు కేటీఆర్ గల్ఫ్ దేశాల్లో భారతీయులు అనుభవిస్తున్న కష్టాలపై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ నేతృత్వంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం కేసీఆర్ నివాసానికి వెళ్లారు. సీఎం సతీమణి, కుమార్తె కవిత, మనవలు .. ఇలా అందరూ ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. కాగా, ఆపరేషన్ అనంతరం వారం, పది రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని కేసీఆర్‌కు వైద్యులు సూచించారు.