: ఉగ్రశిబిరాలపై దాడి చేస్తాం!: పాకిస్థాన్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ఇరాన్!


ఉగ్రవాదుల తయారీకేంద్రంలా మారిన పాకిస్థాన్ కు ఇరాన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఉగ్రవాదులకు సాయం చేయడాన్ని వెంటనే ఆపివేయాలని... లేకపోతే పాక్ భూభాగంలో ఉండే ఉగ్రవాద శిబిరాలపై దాడి చేస్తామని హెచ్చరించింది. క్రాస్ బోర్డర్ టెర్రరిజానికి పాల్పడుతున్న సున్నీ మిలిటెంట్లను వెంటనే నియంత్రించాలని తెలిపింది.

గత నెలలో జరిగిన ఉగ్రదాడిలో 10 మంది ఇరానియన్ బోర్డర్ గార్డ్స్ చనిపోయారు. లాంగ్ రేంజ్ గన్స్ తో జైష్-అల్-ఆదిల్ మిలిటెంట్ సంస్థ ఈ దాడులకు తెగించిందని ఇరాన్ మండిపడింది. ఈ దాడులు పాక్ భూభాగం నుంచి జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలు జరగడాన్ని తాము ఎంత మాత్రం సహించలేమని మేజర్ జనరల్ మొహమ్మద్ బకేరీ తెలిపారు. సున్నీ ఉగ్రవాదులను అరెస్ట్ చేసి, ఉగ్రతండాలను పాక్ ప్రభుత్వం మూసి వేస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. ఒకవేళ పాకిస్థాన్ ఆ పని చేయకపోతే... తామే ఆ పని చేస్తామని, పాక్ భూభాగంలోని ఉగ్రతండాలను ఏరివేస్తామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News